Rapo 23: అప్పుడు అతను.. ఇప్పుడు ఇతను..

ABN , Publish Date - May 19 , 2026 | 04:04 PM

ఈ మధ్యకాలంలో రామ్‌ పోతినేని నుంచి వచ్చిన ‘ఆంధ్రాకింగ్‌ తాలూక’ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది. ఎక్కువ టైమ్‌ తీసుకోకుండా నెలల్లోనే తదుపరి చిత్రం గురించి ప్రకటన చేశారు.

ఈ మధ్యకాలంలో రామ్‌ పోతినేని (Ram Pothineni) నుంచి వచ్చిన ‘ఆంధ్రాకింగ్‌ తాలూక’ చిత్రం అంతంత మాత్రంగానే ఆడింది. ఎక్కువ టైమ్‌ తీసుకోకుండా నెలల్లోనే తదుపరి చిత్రం గురించి ప్రకటన చేశారు. రామ్‌. ఆయన పుట్టిన రోజున కొత్త సినిమా ప్రకటన చేశారు. రామ్‌ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఆయన నటిస్తున్న 23వ (Rapo 23) సినిమా ఇది. తాను రాసుకున్న కథను తానే డైరెక్ట్‌ చేయబోతున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిన నిపుణుల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు ప్రతినాయకుడిగా ఎస్‌.జె సూర్యను ఎంపిక చేసినట్లు తెలిసింది.

తొలుత ఈ పాత్ర కోసం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ను అనుకున్నారు. ఆయనతో చర్చలు కూడా జరిగాయట. కానీ ఇప్పుడు ఎస్‌.జె సూర్యపై దృష్టి పెట్టారు రామ్‌. ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్‌ దాదాపుగా రూ.5 కోట్లు.. ప్రస్తుతం ఆ మాటలే నడుస్తున్నాయని టీమ్‌ నుంచి సమాచారం. సూర్య ఓకే చెప్పేస్తే అంతా సెట్‌ అయినట్టే. ఇక హీరోయిన్‌గా శ్రీనిధిశెట్టి పేరు వినిపిస్తోంది. హీరోయిన్‌ ఓకే అయితే రామ్‌, శ్రీనిధికి ఇది తొలి సినిమా అవుతుంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది.

Updated Date - May 19 , 2026 | 04:05 PM