Hailesso: లైలం బాబు వ‌చ్చేశాడు

ABN , Publish Date - Jul 01 , 2026 | 09:18 AM

‘సుడిగాలి’ సుధీర్‌గా సుపరిచితుడైన సుధీర్‌ ఆనంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’.

Sivaji

‘సుడిగాలి’ సుధీర్‌గా సుపరిచితుడైన సుధీర్‌ ఆనంద్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైలెస్సో’(Hailesso). ప్రసన్నకుమార్‌ కోట (Prasanna Kumar Kota) దర్శకత్వంలో శివ చెర్రీ (Siva Cherry), రవికిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్‌కు హీరోగా ఇది ఐదవ సినిమా కావడం గమనార్హం.

గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘హైలెస్సో’ చిత్రంలో పవర్‌పుల్‌ విలన్‌గా లైలం బాబు (Lailam Babu) పాత్ర పోషిస్తున్నారు శివాజీ (Sivaji). ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

Sivaji

నల్లటి చొక్కా, తెల్లని పంచె ధరించి, చేతిలో ఓ సీసా పట్టుకుని శివాజీ ఆ పోస్టర్‌లో కనిపించారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘హైలెస్సో’ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Jul 01 , 2026 | 09:21 AM