Sunitha: నా బాడీ నా ఇష్టం.. వాడి కళ్ళు వాడి ఇష్టం

ABN , Publish Date - Jun 24 , 2026 | 07:29 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గాత్రంతోనే కాకుండా, ఎంతో హుందాతనంతో కూడిన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ సునీత(Sunitha).

Singer Sunitha

తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గాత్రంతోనే కాకుండా, ఎంతో హుందాతనంతో కూడిన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ సునీత(Sunitha). సమాజంలో జరిగే పలు విషయాలపై ఆమె ఎప్పుడూ ఎంతో స్పష్టంగా, ఆలోచింపజేసేలా మాట్లాడుతుంటారు. సునీత ఎప్పుడు ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళల బట్టల ఎంపిక, స్వేచ్ఛ, సమాజంలో ఎదురయ్యే సామాజిక వాస్తవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


గత కొన్నేళ్లుగా సమాజంలో చాలామంది ఆడవారు.. నా బాడీ.. నా హక్కు(My Body.. My Right ) అనే స్లోగన్ ని వాడుతున్నారు. తాము ఎలాంటి బట్టలు వేసుకున్నా మగవారు కామెంట్స్ చేయకూడదని, తమ శరీరానికి ఏది కంఫర్ట్ ఉంటుందో అదే వేసుకుంటామని తెలుపుతూ.. నా శరీరం.. నా ఇష్టం అని ఈ స్లోగన్ ని ట్రెండ్ చేశారు. తాజాగా సునీతకి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. 'నా బాడీ.. నా హక్కు అనే స్లోగన్ ని బాగా ట్రెండ్ చేశారు. ఫెమినిజంకే మరొక స్లోగన్ అని డ్రైవ్ చేసిన క్యాంపైన్ అది.. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. సునీత తనదైన రీతిలో సమాధానం చెప్పారు.


'మహిళలు నా శరీరం, నా ఇష్టం అని తమకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛను కోరుకున్నప్పుడు, సమాజంలో అవతలి వ్యక్తులు చూసే చూపును కూడా వారి కళ్ళు, వారి ఇష్టం అనే కోణంలోనే చూడాలి. నీ ఇష్టమైన బట్టలు వేసుకో.. హాయిగా ఉండు.. కానీ, ఇదే కరెక్ట్ అని చెప్పొద్దు. అది నా దృష్టిలో ఫ్రీడమ్ కాదు. చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయనేది చూసుకోని నీ బాడీని చూపించుకో. ఇతరుల చూపులు ఇబ్బంది పెట్టకుండా, మనం ఎక్కడైతే పూర్తి సురక్షితంగా భావిస్తామో.. అక్కడ మాత్రమే నచ్చిన దుస్తులు ధరించడం ప్రాక్టికల్‌గా కరెక్ట్.. అది నా అభిప్రాయం ' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Jun 24 , 2026 | 08:27 PM