జనసేనలో చేరిన సింగర్ శ్రీలలిత భర్త..
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:41 PM
సింగర్ శ్రీలలిత (Singer Srilalitha) భర్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ (Gudipati seetharam) జనసేన పార్టీలో (Janasena) చేరారు.
సింగర్ శ్రీలలిత (Singer Srilalitha) భర్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ (Gudipati seetharam) జనసేన పార్టీలో (Janasena) చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్ట్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని సీతారామ్ కలిశారు. పవన్ సిద్ధాంతాలు నచ్చిన సీతారామ్ పార్టీలో చేరుతానని కోరారు. పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో సీతారామ్ సతీమణి, యువగాయని శ్రీమతి శ్రీలలిత కూడా పాల్గొన్నారు.
'నేషన్ ఫస్ట్’ అనే దూరదృష్టితో ముందుకు సాగుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీలో చేరాను. పార్టీ సిద్ధాంతాలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను' అని ఆయన తెలిపారు.