సడెన్ గా ఓటీటీకి వచ్చేసిన సింగ్ గీతం..

ABN , Publish Date - Jul 08 , 2026 | 10:15 AM

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సరికొత్త వైవిధ్యభరిత చిత్రం సింగ్ గీతం(Sing Geetham).

Sing Geetham

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సరికొత్త వైవిధ్యభరిత చిత్రం సింగ్ గీతం(Sing Geetham). అహల్య బంరూ, అయాన్, షాలిని కొండేపూడి, శివ నారాయణ కీలక పాత్రల్లో నటించన ఈ సినిమాను మహానటి, కల్కి 2898 AD చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై చలసాని అశ్విని దత్ సమర్పించారు.ఇక ఈ సినిమా జూన్ 12 న రిలీజ్ మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. నెల తిరక్కుండానే సింగ్ గీతం ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో జూలై 8 నుంచి అనగా నేటి నుంచి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 94 ఏళ్ల లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపించారు. అంతేకాకుండా ఎంతోమంది స్టార్స్ ఈ సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు.


కథ విషయానికొస్తే.. సింగ్ గీతం ఒక వినూత్నమైన మ్యూజికల్ ఫాంటసీ డ్రామా. ప్రకృతిని పూర్తిగా నాశనం చేసి, బంగారు గనుల మైనింగ్‌గా మారిన ఒక గ్రామంలో మిగిలి ఉన్న చిట్టచివరి పవిత్రమైన చెట్టును కొందరు స్వార్థపరులు నరికేయడంతో ఆ ఊరికి ఒక వింతైన శాపం చుట్టుముడుతుంది. ఆ మరుసటి రోజు నుంచి ఆ ఊరి ప్రజలందరూ సాధారణంగా మాట్లాడే శక్తిని కోల్పోయి, తమ మనసులోని కోపం, ప్రేమ, బాధ వంటి ప్రతి భావాన్ని కేవలం పాట రూపంలో మాత్రమే వ్యక్తపరచాల్సి వస్తుంది. ఈ వింత పరిస్థితి వల్ల ఆ ఊరిలో ఎలాంటి గందరగోళం నెలకొంది..? మాటలు లేకుండా కేవలం సంగీతంతోనే మనుషులు ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు..? చివరకు తమ తప్పును తెలుసుకుని ప్రకృతిని కాపాడుకుంటూ ఆ శాపం నుండి ఎలా విముక్తి పొందారు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 08 , 2026 | 10:21 AM