SIIMA: సైమా అవార్డ్స్-2026 తేజ సజ్జా, ఐశ్వర్య రాజేశ్ సత్తా!
ABN , Publish Date - Sep 13 , 2026 | 09:54 AM
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్-2026 వేడుక ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదికగా నిలిచింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్-2026 వేడుక ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదికగా నిలిచింది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్-2026 వేడుక ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదికగా నిలిచింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.రెండు రోజుల పాటు జరగనున్న ఈ అవార్డుల వేడుకలో తొలిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేశారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందించారు. ‘మిరాయ్’లో తన నటనకు యువ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకుగాను ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును దక్కించుకున్నారు. ఇదే సినిమాలో బుల్లిరాజు పాత్రతో ప్రేక్షకులను నవ్వించిన భీమల రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా నిలిచారు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ‘కాంతార: చాప్టర్ 1’ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. మొత్తంగా సైమా వేదికపై తెలుగు, కన్నడ చిత్రాల ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది.
సైమా అవార్డ్స్ - విజేతలు
ఉత్తమ నటుడు: తేజ సజ్జా – మిరాయ్
ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేశ్ – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సహాయ నటుడు: సత్యదేవ్ – కింగ్డమ్
ఉత్తమ సహాయ నటి: శ్రద్ధా శ్రీనాథ్ – డాకు మహారాజ్
ఉత్తమ హాస్య నటుడు: భీమల రేవంత్ (బుల్లిరాజు) – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ నటుడు (పరిచయ): హర్ష్ రోషన్ – కోర్ట్
ఉత్తమ నటి (పరిచయ): శ్రీదేవి – కోర్ట్
ఉత్తమ నటి (పరిచయ): సాక్షి మడోల్కర్ – మోగ్లీ
ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి – కోర్ట్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని – మిరాయ్
ఉత్తమ నేపథ్య గాయకుడు: రమణ గోగుల – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ నేపథ్య గాయని: సమీరా భరద్వాజ్ – కోర్ట్
ALSO READ:
Samantha: అమ్మ కాబోతున్న క్షణాలు.. సామ్ ఏం చెప్పారంటే
Keerthy Suresh: దశాబ్దం తర్వాత టిఫ్‌లో తమిళ సినిమా.. ‘డోరతి’కి స్టాండింగ్ ఒవేషన్!
Samantha: ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యం.. సమంతలో ఇంత మార్పా?
Vijay-Trisha: త్రిష రాగానే విజయ్ ఎందుకు ముఖం తిప్పుకున్నారు? నెటిజన్ల చర్చ!