Shubhakruth Nama samvatsaram: గొప్ప సినిమాకు కావలసిన అర్హతలు ఉన్నాయి..
ABN , Publish Date - Jan 19 , 2026 | 09:43 PM
నరేష్ విజయ్ కృష్ణ (Vk Naresh) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శుభకృత్ నామ సంవత్సరం' (Shubhakruth Nama samvatsaram) . ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వి పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు.
నరేష్ విజయ్ కృష్ణ (Vk Naresh) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శుభకృత్ నామ సంవత్సరం' (Shubhakruth Nama samvatsaram) . ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వి పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ను సోమవారం ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేశారు.
నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ 'మా కుటుంబంలో ఏదైనా సరే మాతో వచ్చి నిలబడే ఫ్యాన్స్ ని కృష్ణ గారు మాకు ఇచ్చి వెళ్లారు. రామోజీరావు గారు జంద్యాల గారు నాకు ఒక ఫ్యామిలీ. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు మరో ఫ్యామిలీ లాగా వచ్చారు. నాకోసం ఒక క్యారెక్టర్ రాయడం అనేది నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మహేష్ తర్వాత అంత మంచి సెటిల్ గా ఉండే టైమింగ్ శ్రీవిష్ణులో చూశాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా ముందుకు వెళ్తున్న కొద్ది లీడ్ రోల్స్ కూడా మొదలయ్యాయి. అయితే నేను ప్రతిదీ క్యారెక్టర్ గానే చూస్తాను. శుభకృత్ నామ సంవత్సరం కథ చాలా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఇది డ్రామా సస్పెన్స్ ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా. అద్భుతమైన విజయం సాధించే అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా తెలుగు కన్నడలో చాలా మంచి పేరు తీసుకొస్తుంది' అన్నారు.
శ్రీ విష్ణు మాట్లాడుతూ 'సామజవరగమన' నాకు మంచి పేరు తీసుకొచ్చింది. నరేష్ గారికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా తర్వాత ఏ కథ వచ్చిన ఫాదర్ గా నరేష్ గారే అంటున్నారు. దానికంటే ఒక గొప్ప కథ వచ్చినప్పుడు చేస్తానని ఎదురు చూశాను. అలాంటి సినిమా మా కాంబినేషన్లో చూడబోతున్నా.రు ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.
డైరెక్టర్ సజ్జన్ మాట్లాడుతూ 'నేను ఇప్పటివరకూ నాలుగు సినిమాకు చేశాను. లాస్ట్ ఫిలిం కి కర్ణాటక బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నరేష్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనకి కథ చాలా నచ్చింది. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మీ అందరికీ కచ్చితంగా అలరించేలా ఉంటుంది' అన్నారు.
నిర్మాత విశ్వనాధ్ నాయక్ మాట్లాడుతూ 'మంచి కథతో ఈ సినిమా తీస్తున్నాం. మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరించేలా ఉంటుంది' అన్నారు