Shruti Haasan: చెన్నైకి షిఫ్ట్.. కారణం ఇదే!
ABN , Publish Date - Jul 16 , 2026 | 09:30 AM
అగ్ర నటుడు కమల్ హాసన్ (Shruthi Haasan) కుమార్తె, ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ముంబైకి గుడ్‌బై చెప్పి చెన్నైకి మకాం మార్చారు.
అగ్ర నటుడు కమల్ హాసన్ (Shruthi Haasan) కుమార్తె, ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ముంబైకి గుడ్‌బై చెప్పి చెన్నైకి మకాం మార్చారు. నగరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన ఆమె ఇటీవల గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఫొటోలను శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా ముంబైలో నివసిస్తున్న శ్రుతిహాసన్.. ఇకపై చెన్నైలోనే స్థిరపడనున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయానికి అనుగుణంగా కొత్త ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేశారు.
శ్రుతి చెన్నైకి మారడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. నటిగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించడంతో పాటు, తన తండ్రి కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై కూడా ఆమె మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సంస్థ నిర్మించే చిత్రాల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించేందుకు చెన్నైలో ఉండటం అనుకూలంగా ఉంటుందని భావించినట్లు సమాచారం.
కాగా, దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘ట్రైన్’ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.