Shruti Haasan: సిగరెట్ తాగుతూ స్టైలిష్ గా శ్రుతి.. ఇది అస్సలు ఊహించలేదే

ABN , Publish Date - Jan 28 , 2026 | 07:03 PM

అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది కూలీ సినిమాతో పరాజయాన్ని అందుకున్నా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Shruti Haasan

Shruti Haasan: అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది కూలీ సినిమాతో పరాజయాన్ని అందుకున్నా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందులో భాగంగానే శ్రుతి నటిస్తున్న చిత్రం ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara). వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నస్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోంటున్నాయి. ఈ సినిమాలో శ్రుతి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. జనవరి 28 న శ్రుతి హాసన్ పుట్టినరోజు కావడంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. టీమ్ శ్రుతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. రిలీజ్ అయిన రెండు పోస్టర్స్ అదిరిపోయాయి. మునుపెన్నడూ లేనివిధంగా శ్రుతి కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించింది. పెదవుల పై ఉన్న సిగరెట్‌, దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు రఫ్‌, గ్రిట్టీ టచ్‌ను జోడిస్తోంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుందని, ఆమె ప్రజెన్స్ పవర్ ఫుల్ గా ఉండబోతోందని పోస్టర్ ని బట్టి తెలుస్తోంది.

శ్రుతి హాసన్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ చూసిన అభిమానులు ఇలాంటి ఒక పాత్రలో శ్రుతి నటిస్తోందని అస్సలు ఊహించలేదు. ఈ పోస్టర్ చూశాక సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ఆకాశంలో ఒక తార చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Updated Date - Jan 28 , 2026 | 07:03 PM