లైఫ్‌లో వచ్చే కష్టమైన రోజులన్నీ విలువైన పాఠాలు: శృతి హాసన్
ABN , Publish Date - Jun 19 , 2026 | 09:16 AM
జీవితంలో ఎదురయ్యే కష్టమైన రోజులు ఎంతో విలువైన పాఠాలతో సమానమని హీరోయిన్ శృతి హాసన్ అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జీవితంలో ఎదురయ్యే కష్టమైన రోజులు ఎంతో విలువైన పాఠాలతో సమానమని హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏ రంగంలోనైనా రాణించాలని అనుకుంటే ఖచ్చితంగా సవాళ్ళను అధిగమించాల్సిందే. అది సహజం. కానీ, మీరు దేనినైనా నిజంగా ప్రేమించి, మీ జీవితంలో అదే చేయాలని నమ్మినప్పుడు, కష్టమైన రోజులు కూడా విలువైన పాఠాలుగా మారుతాయి. ఆ మంచి రోజులు కూడా మిమ్మల్ని ముందుకు సాగేలా ప్రోత్సహిస్తాయి’’ అని పేర్కొన్నారు. శృతి హాసన్ ఒకటికి రెండు సార్లు ప్రేమలో విఫలమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె సినిమాలతో పాటు క్రీడా పోటీలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుని సందడి చేశారు.
సినిమాల పరంగా ప్రస్తుతం ఆమె అంత బిజీగా అయితే లేరు కానీ, రీసెంట్‌గా వచ్చిన ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్‌లో మెరిసి.. మరోసారి తన సత్తా ఏంటో చాటారు. అలాగే.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘వారణాసి’ (Varanasi) సినిమా కోసం ఓ పాట పాడి సంచలనంగా మారారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘సలార్ 2’ చిత్రం ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్‌లు ఆమె ఓకే చేయాల్సి ఉంది. రీ ఎంట్రీలో మంచి సక్సెస్‌లు అందుకున్నప్పటికీ, ఎందుకు ఆమెకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మరోవైపు మ్యూజిక్‌పై కూడా ఆమె దృష్టిసారించినట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
డిప్యూటీ సీఎంగా లారెన్స్.. అభిమానులతో జాగ్రత్త!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!
వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే