శివానీ నాగారం: స్టార్ హీరోలతో అవకాశం వస్తే యాక్ట్ చేస్తా.. కానీ 

ABN , Publish Date - Feb 16 , 2026 | 05:33 PM

సినిమా వెంట సినిమా చేయకపోతే కనిపించకుండాపోతావు అని చాలా మంది చెబుతున్నారు. నేను మాత్రం సెలక్టివ్‌గానే ముందుకు వెళ్తాను. ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అందరి నోట వినాలని ఉంది

Shivani Nagaram

'సినిమా వెంట సినిమా చేయకపోతే కనిపించకుండాపోతావు అని చాలా మంది చెబుతున్నారు. నేను మాత్రం సెలక్టివ్‌గానే ముందుకు వెళ్తాను. ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అందరి నోట వినాలని ఉంది. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మా ముందున్న లక్ష్యం' అని శివాని నాగారం (Shivani Nagaram) అన్నారు.

సుహాస్ తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘హే బలవంత్‌' (హే భగవాన్‌ టైటిల్ మారింది- Hey Balavanth)). గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.  నరేష్, యాంకర్ స్రవంతి  కీలక పాత్రలు పోషించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ  సందర్భంగా శివానీ సోమవారం విలేకర్లతో మాట్లాడారు. 

అదొక సర్‌ఫ్రైజ్‌.. (Shivani Nagaram Interview)

నటిగా మూడో సినిమా ఇది. సుహాస్‌తో రెండో సినిమా. ఇదొక ఇంటెన్స్‌ స్టోరీ. నాది లైటర్‌ వెయిన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర. చాలా ఎంజాయ్‌ చేస్తూ వర్క్ చేసాను. చివరిలో ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌ అందర్ని అలరిస్తుంది. నా పాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. సుహాస్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మనిషి. చాలా మంచి నటుడు. ఇద్దరి మధ్య సన్నివేశాలను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. నరేష్‌, వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్స్‌ హిలేరియస్‌గా ఉంటాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సర్‌ఫ్రైజ్‌లాగా ఉంటుంది. నాకు తప్పకుండా హ్యాట్రిక్ సినిమా అవుతుంది.   

GANI3445.JPG

కాంబినేషన్‌తో సంబంధం లేదు.. 

నేను అందుకున్న సక్సెస్‌ను అడ్వాంటేజీగా తీసుకుని తదుపరి సినిమా కమిట్‌ అవుతాను. నా దగ్గరకు వచ్చిన కథల్లో బాగా కనెక్ట్ అయ్యి, నాకు నప్పుతుంది అనుకుంటేనే అంగీకరిస్తా. కథ నచ్చితేనే కాంబినేషన్‌తో సంబంధం లేకుండా సినిమా ఒప్పుకుంటాను. సినిమాలో నా ప్రాధాన్యత ఏమిటనేది చూసుకుంటాను. అది నాకు ముఖ్యం. నా మొదటి సినిమాలో కామెడీలో లేదు. సెకండ్‌ సినిమాలో ఫుల్‌ కామెడీ, ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. వినగానే కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది. 

పిలిస్తే పాడతాను.. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో నటులతో పాటు రైటర్స్‌, దర్శకులు ఎక్కువయ్యారు. తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. చిన్న పెద్దా సినిమా అనే తేడా లేదు. చిన్న సినిమాలను కూడా ఆడియన్స్‌ పెద్ద సినిమాలు చేస్తున్నారు. నాకు 100 సినిమాలు చేయాలని లేదు.  ఐదు సినిమాలు  చేసినా మంచి కథలతోనే  చేస్తాను. అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. రొమాంటిక్‌ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. మూడ్‌ అప్‌సెట్‌లో ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌ సినిమాలు చూస్తే మూడ్ సెట్‌ అవుతుంది.  నేను నటించిన సినిమాలు ఓటీటీలో రావడం వల్ల అన్ని భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.  నేను పాటలు కూడా పాడతాను. లిటిల్‌ హార్డ్స్‌లో చిన్న హమ్మింగ్‌ ఉంటుంది. 'ఆరంభం' సినిమాలో ఓ పాట పాడాను. నాకు అవకాశం ఇస్తే పాటలు కూడా పాడతాను. 

Updated Date - Feb 16 , 2026 | 05:42 PM