Shivaji: భవిష్యత్తులో.. అనిల్ రావిపూడి హీరో అవుతాడు
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:17 AM
నటుడు శివాజీ తన సొంత బ్యానర్ ‘శ్రీ శివాజీ ప్రొడక్షన్స్’లో నిర్మించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.
నటుడు శివాజీ తన సొంత బ్యానర్ ‘శ్రీ శివాజీ ప్రొడక్షన్స్’లో నిర్మించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’(Sampradayini Suppini Suddapoosani). సీనియర్ హీరోయిన్ లయ కీలకపాత్రలో నటించారు. ఈనెల 12న ప్రముఖ ఓటీటీలో విడుదలవుతోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ గారు ఫోన్ చేసి ట్రైలర్ ఈవెంట్‌కు రావాలని అడిగారని అంతేగాక అబ్బాయ్.. ఈసారి జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పాడన్నారు.
శివాజీ మాట్లాడుతూ ‘టీమ్ అంతా కష్టపడి ఒక మంచి చిత్రాన్ని రూపొందించాం. మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. అనిల్ రావిపూడి చుట్టూ చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది అని బాస్ కే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ హిట్ ఇచ్చాడంటే అది సామాన్యమైన విషయం కాదని అన్నారు. నేను లోపలికి వస్తుంటే అనిల్ ఫొటోలు చూస్తే.. భవిష్యత్తులో అనిల్ రావిపూడి కూడా హీరో అవుతాడని అనిపించింది అని అన్నారు. నా సొంత డబ్బులు పెట్టి తీసిన 'తాజ్ మహల్' కంటే.. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ అన్నారు.
లయ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నన్ను స్వయంవరంలో రత్నమాలగా గుర్తుపెట్టుకున్న ప్రేక్షకులు ఈ సినిమా తర్వాత ఉత్తరగా గుర్తుపెట్టుకుంటారు. అంతటి వైవిధ్యమైన పాత్రను దర్శకుడు సుధీర్ నాకు ఇచ్చారు’ అని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు సుధీర్ అన్నారు.