Shiva Kandukuri: చాయ్ వాలాకు సజ్జనార్ దన్ను
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:45 AM
శివ కందుకూరి నటించిన 'చాయ్ వాలా' సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఆవిష్కరించారు.
శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’ (Chai Wala). ప్రమోద్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో శుక్రవారం టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్ (VC Sajjanar), నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, 'మన జీవితంలో చాయ్ అనేది ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. శివ కందుకూరి లాంటి యంగ్ హీరో, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో నటించారు. నీలోఫర్ బాబుగారు అందరికీ స్పూర్తి. ఆయన ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. అందరూ ఈ మూవీని చూసి హిట్ చేసి, యంగ్ టీంని ఆశీర్వదించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. బాబురావు మాట్లాడుతూ, 'నేను చాయ్‌తోనే ఈ స్థాయికి వచ్చాను. ఈ ‘చాయ్ వాలా’ కార్యక్రమానికి నన్ను పిలవడం ఆనందంగా ఉంది. చాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. చాయ్ వాలా అనే పేరు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారు. ఈ 'చాయ్ వాలా' మూవీతో టీం అందరికీ మంచి గుర్తింపు రావాలి. సజ్జనార్ గారి హస్తవాసి చాలా మంచిది. ఆయన చేతుల మీదుగా పాట రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. రవికిరణ్ వర్మ మాట్లాడుతూ, 'అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా తీయాలని ప్రమోద్ చెబుతుండేవాడు. చాయ్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఇక ఇందులో తండ్రీకొడుకుల రిలేషన్‌ను చూపించాడు. ‘చాయ్ వాలా’ టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. నీలోఫర్ కేఫ్ ఎండీ శశాంక్ మాట్లాడుతూ, 'నేను సినిమాలు ఎక్కువగానే చూస్తాను. మా నాన్న బాబురావు గారు అస్సలు సినిమాలు చూడరు. కేవలం ‘చాయ్ వాలా’ అనే టైటిల్ చూసి ఇక్కడకు వచ్చారు. ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ను చక్కగా చూపించబోతున్నారు. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రాజ్ కందుకూరి (Raj Kandukuri) మాట్లాడుతూ, 'చాయ్ వాలా మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుంటుంది. అంతే కాకుండా చాయ్‌కి, షాప్ ఓనర్‌కి కూడా ఓ అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఎమోషన్‌ను ప్రమోద్ అద్భుతంగా రాసుకున్నారు. ఇలాంటి కథను సపోర్ట్ చేసిన నిర్మాత వెంకట్ గారికి హ్యాట్సాఫ్. ఈ కథ విన్న తరువాత ఫాదర్ పాత్రని ఎవరు పోషిస్తారా? అని అనుకున్నాను. కానీ ప్రమోద్ మాత్రం ముందు నుంచీ రాజీవ్ కనకాల గారినే అనుకున్నారు. ఈ చిత్రంలో అందరి పాత్రలు అద్భుతంగా వచ్చాయి. ప్రశాంత్ గారి పాటలు, ఆర్ఆర్ బాగా వచ్చింది. పవన్ ఎడిటింగ్, సురేష్ లిరిక్స్ బాగుంటాయి. ఇందులో కొత్త శివని చూస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ చూసి నేను కూడా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాను చూడండి. నచ్చితే మౌత్ టాక్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. శివ కందుకూరి మాట్లాడుతూ, 'మా సినిమాని ఎంత కష్టపడి, ఇష్టపడి చేశామో టీమ్ మాటలే చెబుతాయి. ఈ మూవీలోని ఎమోషన్ అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌లో రాజీవ్ కనకాల గారు ప్రాణం పెట్టేశారు. రాజీవ్ గారి లాంటి అద్భుతమైన నటుడుతో యాక్ట్ చేయడంతో నేను ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ, 'నన్ను నమ్మి సపోర్ట్ చేసిన నా నిర్మాత వెంకట్ గారికి థాంక్స్. ఈ మూవీకి రాజీవ్ కనకాల (Rajeev Kanakala) ప్రాణం. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన రాజ్ సార్‌కు థాంక్స్. ఈ చిత్రంలో శివ అదరగొట్టేశారు. నేను ఈ మూవీ విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను' అని అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి ప్రశాంత్ అద్భుతమైన సంగీతం అందించారు. సురేష్ గారు మంచి పాటల్ని రాసిచ్చారు. సుప్రియ గారు వేసిన సెట్స్ ఎంతో నేచురల్‌గా ఉంటాయి. క్రాంతి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వెంకట్ గారు టీంని ఎంతో సపోర్ట్ చేశారు. నటుడిగా శివ నాకు చాలా ఇష్టం. నాలోని యాక్టింగ్ స్కిల్‌ని బయటకు తీసుకు రావడానికి శివ యాక్టింగ్ కూడా ఓ కారణమైంది. హీరోయిన్ తేజు కూడా చక్కగా నటించారు’ అని అన్నారు. ఇందులో ఈ కార్యక్రమంలో సహ నిర్మాత వెంకట్, కెమెరామ్యాన్ క్రాంతి వర్ల, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి (Prashanth R Vihari), గీత రచయిత సురేశ్ బనిశెట్టి, ఎడిటర్ పవన్ నరవ, స్క్రీన్ ప్లే రైటర్ ఇమ్రాన్ కూడా మాట్లాడారు.