గొర్రెలు అమ్మి.. తీసిన సినిమా ‘స్పిరిట్’
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:18 AM
గొర్రెలు కాచుకునే భార్యాభర్తలు చిన్నబోయిన రైతు నర్సమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించిన చిత్రం స్పిరిట్.
రవిబాబు (ravibabu), సత్య ప్రకాశ్ (sathyaprakash), చిత్రం శ్రీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా సీహెచ్ రవీంద్రనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్పిరిట్’ (spirit). ఎయిత్ వండర్ సినిమా బ్యానర్‌పై గొర్రెలు కాచుకునే భార్యాభర్తలు చిన్నబోయిన రైతు నర్సమ్మ (Narasamma), వెంకటేశ్వర్లు (Venkateshwarlu) నిర్మించారు.
సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘ఎప్పుడైతే నిర్భయంగా ఉంటామో, అప్పుడు ఏదైనా సాధించగలం. దానికి నర్సమ్మ నిదర్శనం. లాభనష్టాలు పట్టించుకోకుండా పట్టుదలతో తన కొడుకుతో సినిమా తీశారు’ అని అభినందించారు.

దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ ‘నర్సమ్మ తన కుటుంబం కోసం ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయి తిరిగి రావాలి. ఈ దంపతులు ఎందరికో స్ఫూర్తి. సినిమా ఘన విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. ‘మాకు ఉన్న గొర్రెలు అమ్ముకొని సినిమా తీశాము. అందరూ మమ్నల్ని ఎగతాళి చేసినా పట్టించుకోలేదు’ అని చిత్ర నిర్మాతలు నర్సమ్మ, వెంకటేశ్వర్లు అన్నారు.