SSS1: శర్వానంద్ 'జార్జ్ క్రిష్'.. మొద‌లెట్టేశాడు

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:02 AM

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా శుక్ర‌వారం గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Sharwanand

శర్వానంద్ (Sharwanand), శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా శుక్ర‌వారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఉదయం 9:45 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా మాజీమంత్రి త‌ల‌సాని క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంతో సినిమాకు అధికారికంగా ఫస్ట్ క్లాప్ పడింది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) నిర్మిస్తుండ‌గా ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్.. ఈ ప్రాజెక్ట్‌తో మరో కొత్త జోనర్‌లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

Sharwanand

కాగా ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల ఇప్పుడు ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన మార్క్ కామెడీ, వన్‌లైనర్ పంచ్‌లతో పాటు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. శర్వానంద్‌కు ఉన్న క్లాస్ అండ్ మాస్ ఇమేజ్‌కు శ్రీను వైట్ల స్టైల్ కామెడీ జోడైతే థియేటర్లలో మంచి ఎంటర్‌టైన్మెంట్ అందుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా కథ, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్ప‌టికే నారీ నారీ న‌డుమ మురారి, బైక‌ర్ వంటి రెండు సినిమాల‌తో హిట్ కొట్టిన శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రం భోగి థియేట‌ర్ల‌లోకి రానుంది.

Sharwanand

Updated Date - Aug 14 , 2026 | 11:09 AM