Sharwanand: కిరణ్ ప్రయత్నం ప్రత్యేకం.. నిర్ణయం అభినందనీయం
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:25 PM
కిరణ్ అబ్బవరం (Kiran Ababvaram) నిర్మాతగా మారి కొత్త టాలెంట్స్‌ను ఎంకరేజ్ చేస్తూ తీసిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని ఆదరణ దక్కించుకుంది.
కిరణ్ అబ్బవరం (Kiran Ababvaram) నిర్మాతగా మారి కొత్త టాలెంట్స్‌ను ఎంకరేజ్ చేస్తూ తీసిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని ఆదరణ దక్కించుకుంది. దీనిపై హీరో శర్వానంద్ (Sharwanand) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు నమ్మి సినిమా నిర్మించడం అంత ఈజీ పని కాదు. ఒకేసారి 40 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం అంటే 40 కలలకు వేదిక కల్పించినట్లే! బ్రదర్ కిరణ్ చేసిన ప్రయత్నం ఎంతో ప్రత్యేకం. తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇప్పటికే సినిమాకు వస్తున్న స్పందన గమనించా. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్నా.. తప్పకుండా సినిమా చూస్తా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం శర్వానంద్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం తెలివైన ఆలోచన చేశారు. కొత్తవారితో తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేశారు. మంచి ఓటీటీ డీల్ కుదిరింది. థియేటర్‌ల నుంచి వచ్చేది లాభంగా అనుకోవచ్చు. పల్లెటూరి నేపథ్యంలో ఓ టీవీ దొంగతనం చుట్టూ తిరిగిన ఈ చిత్రానికి మునిరాజు దర్శకుడు. కొత్తవారైన సాయి తేజ, ప్రదీప్ కొట్టే, వేద తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా సహజంగా ఉందని సినీ ప్రియుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి