Sharwanand: భారీ సెట్‌లో ‘భోగి’ సందడి

ABN , Publish Date - Jan 06 , 2026 | 09:16 AM

శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు.

Sharwanand

శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’(BHOGI). పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంపత్ నంది (Sampath Nandi) దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి హీరోయిన్లు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ (Sri Sathya Sai Arts) బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.

1960 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ వేశారు. ఆనాటి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నేపథ్యంలో సాగే కథ ఇది. కళాదర్శకుడు కిరణ్‌కుమార్‌ మన్నె రూపొందించిన ఈ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను సోమవారంనుంచి చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందెన్నడూ తను పోషించని ఓ విభిన్న పాత్రను ఇందులో శర్వా చేస్తున్నారు. భీమ్స్‌ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘భోగి’ చిత్రం విడుదలవుతుంది.

Updated Date - Jan 06 , 2026 | 09:45 AM