Shanti Srihari: ‘ఆస్మాన్’లో మేఘాంశ్ శ్రీహరి.. సింహంలా కనిపిస్తున్నాడు

ABN , Publish Date - Aug 16 , 2026 | 10:55 AM

‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను.

మేఘాంశ్ శ్రీహరి(Meghams Srihari) హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’ (Asmaan) వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రూపొందుతోంది. స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు.  

శాంతి శ్రీహరి మాట్లాడుతూ  ‘మేఘాంశ్ మీద నమ్మకంతో ‘ఆస్మాన్’ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్‌ రాత్రింబవళ్ళు పని చేస్తున్నాడు. బావ కూడా అలాగే చేసేవారు.  ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి. మేఘాంశ్‌ని అద్భుతంగా చూపిస్తున్న రామ్ నందన్‌కి థాంక్స్.  ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్ చూశాన తర్వాత సింహాన్ని చూసినట్టుగా అనిపించింది' అన్నారు. 

హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ
'రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది. ప్రశాంత్ గారి బీజీఎం అద్భుతంగా ఉండబోతోంది' అని అన్నారు.

దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ  ‘‘ఆస్మాన్’ మూవీతో అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. థియేటర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు, హీరో మేఘాంశ్ గారికి, విజువల్స్ ఇచ్చిన షోయబ్ గారికి థాంక్స్. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో వస్తామ’ని అన్నారు.

నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ  ‘
‘ఆస్మాన్’ పోస్టర్ అద్భుతంగా ఉంది. నాకు పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. సెట్‌లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా ఉంటాడు' అని అన్నారు.
 

Updated Date - Aug 16 , 2026 | 11:24 AM