బన్నీకి విలన్‌గా షాహిద్ కపూర్.. లోకేషా.. మజాకానా
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:11 PM
పుష్ప సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో రికార్డులు తిరగరాసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే.
పుష్ప సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో రికార్డులు తిరగరాసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. అట్లీ దర్శకత్వంలో రాకా సెట్స్ మీద ఉంది. దీని తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో AA23 చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత వేగంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సంచలనాత్మక వార్త వైరల్ అవుతోంది. ఈ పవర్-ప్యాక్డ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. అయితే కొందరు అల్లు అర్జున్‌కు సరిజోడీగా, విలన్ పాత్రలో షాహిద్ కపూర్ నటించబోతున్నాడని చెప్పుకొస్తున్నారు.
సాధారణంగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే చిత్రాలలో విలన్ పాత్రలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మాస్టర్ లో విజయ్ సేతుపతి, విక్రమ్ లో సూర్య , లియోలో సంజయ్ దత్, కూలీలో నాగార్జున వంటి అగ్ర కథానాయకులనే పవర్‌ఫుల్ విలన్లుగా చూపించడం ఆయన ప్రత్యేక శైలి. విలన్ పాత్రకు కథలో కథానాయకుడితో సమానమైన వెయిటేజీ ఇవ్వడం లోకేష్ బలం. అదే తరహాలో AA23 లో కూడా షాహిద్ కపూర్‌ను కేవలం రూత్‌లెస్ విలన్‌గానే కాకుండా, ఎంతో ఇంటెన్స్, గ్రిట్టీ రోల్‌లో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. కబీర్ సింగ్, ఫర్జీ వంటి ప్రాజెక్ట్‌లలో డార్క్ షేడ్స్‌లో అదరగొట్టిన షాహిద్ ఎంట్రీ ఈ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లనుంది.
మరోవైపు అల్లు అర్జున్ స్టార్‌డమ్, స్వాగ్‌కి తగ్గట్టుగా లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్‌గా, మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎలివేషన్లతో సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఉండదట. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి. విదేశీ లొకేషన్లతో పాటు భారీ సెట్లలో ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఐకానిక్ మాస్ ప్రెజెన్స్, లోకేష్ డాక్యుమెంటరీ-స్టైల్ డార్క్ యాక్షన్ టేకింగ్, దానికి తోడు షాహిద్ కపూర్ రూపంలో బలమైన ప్రతినాయకుడు తోడైతే AA23 బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోందని.. లోకేషా.. మజాకానా.. అదరగొట్టేసాడని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.