విజయ్ దేవరకొండ సినిమాలో విలన్‌గా ఆ సీనియర్ హీరో
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:38 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒక మంచి హిట్ కోసం ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్నాడు. గతేడాది కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒక మంచి హిట్ కోసం ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్నాడు. గతేడాది కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం విజయ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రౌడీ జనార్ధన (Rowdy Janardhana). రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తోన్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది.
ఇప్పటికే రౌడీ జనార్ధన నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుర్రమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ కి ధీటైన విలన్ కోసం మేకర్స్ వెతుకుతున్నారు. ఈ కథ రాసుకొనేటప్పుడే డైరెక్టర్ రవికిరణ్ .. విలన్ గా విజయ్ సేతుపతిని ఊహించుకొని రాసుకున్నాడట. అనుకున్నట్లుగానే విజయ్ ని మేకర్స్ సంప్రదించగా.. ఆయన రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. దీంతో అంత బడ్జెట్ పెట్టలేమని దిల్ రాజు తెలుగులోనే సీనియర్ హీరోని ఫైనల్ చేశాడట.
టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కి రీఎంట్రీలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈమధ్యనే బైకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా రౌడీ జనార్ధనలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం మేకర్స్ రాజశేఖర్ ని సంప్రదించగా.. ఆయన ఓకే అన్నారట. విజయ్ కి ధీటైన విలన్ గా రాజశేఖర్ కనిపించనున్నారట. వీరిద్దరి మధ్య ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయట. అంతేకాకుండా రాజశేఖర్ చాలా గంభీరమైన లుక్ లో లో కనిపించనున్నారని టాక్. ఇదే కనుక నిజమైతే రాజశేఖర్ లక్ మారిపోయినట్టే. మరి యాంగ్రీ మ్యాన్.. తన విలనిజంతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.