షావుకారు జానకికి అస్వస్థత

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:49 AM

సీనియర్ సినీ నటి షావుకారు జానకి (95) (Sowcar Janaki) అస్వస్థతకు గురయ్యారు.

Sowcar Janaki

సీనియర్‌ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు చేర్పించారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి షావుకారు జానకి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సుదీర్ఘ కాలం నటిగా కొనసాగిన షావుకారు జానకి తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1949లో విడుదలైన ‘షావుకారు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.

అనంతరం తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. షావుకారు జానకి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Aug 20 , 2026 | 06:35 AM