Jayasudha: 350 కి పైగా సినిమాలు.. ఇప్పటికీ తెలుగు చదవడం రాదు
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:43 PM
టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించి, కళ్లు చెమర్చే డైలాగ్ డెలివరీతో మెప్పించిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ సీనియర్ నటి, సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha) నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించి, కళ్లు చెమర్చే డైలాగ్ డెలివరీతో మెప్పించిన ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు వరుస ఇంటర్వ్యూలలో కనిపించే జయసుధ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. తాజాగా ఆమె ప్రముఖ నటుడు రాజా రవీంద్ర హోస్ట్ చేస్తోన్న పాడ్ క్యాస్ట్ లో పాల్గొని తన మనోగతాన్ని వివరించారు. ఇక ఈ పాడ్ క్యాస్ట్ లో జయసుధ.. తనకు ఇప్పటివరకు తెలుగు చదవడం, రాయడం రాదు అని చెప్పడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
'ఇప్పటికీ నాకు తెలుగు రాయడం రాదు. మొన్న కూడా ట్రై చేశా.. జయసుధను జభసుధ అని రాశాను. రాదు అనుకున్నదాన్ని వదిలేస్తాను. తమిళ్ చదువుతాను. తమిళ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఇంగ్లీష్ బాగా నేర్పించేవారు. గొప్ప అని కాదు కానీ, ఇంగ్లీష్ బాగా వచ్చు. పంజాబీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోని చెన్నై కి వచ్చాక ఆయనకు తమిళ్ వచ్చేసింది.
తమిళ్ లో కేవలం 18 అక్షరాలే ఉంటాయి కాబట్టి అది ఈజీగా వచ్చింది కానీ, తెలుగులో 56 అక్షరాలు ఉండటం వల్ల నేర్చుకోలేకపోయాను. జిలేబీలు చూసిన ప్రతిసారీ నాకు తెలుగు అక్షరాలను చూసినట్లు ఉంటుంది. కానీ, నేను నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఎంత నేర్పించినా నాకు రాలేదు. అయితే దేవుడిచ్చిన గిఫ్ట్ వల్ల డైలాగ్స్ విని గుర్తుపెట్టుకుని చెప్పడం అలవాటుగా మారింది' అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 350 పైగా సినిమాలు చేసి 9 నంది అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న జయసుధ తెలుగు రాదు అనడంపై పలువురు మండిపడుతున్నారు.