శ్రీనివాస మంగాపురం.. స్వ‌తంత్య్ర‌ బాబు ఫ‌స్ట్ లుక్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:09 PM

కృష్ణ మ‌నుమ‌డు జ‌య‌కృష్ణ హీరోగా ఆరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి న‌రేశ్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Srinivasa Mangapuram

కృష్ణ మ‌నుమ‌డు జ‌య‌కృష్ణ (Jaya Krishna Ghattamaneni) హీరోగా ఆరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ర‌వీనాటాండ‌న్ త‌న‌య‌, బాలీవుడ్ లేటెస్ట్ హార్ట్ త్రోబ్ ర‌షా త‌దాని (RashaThadani) తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.

ఆరెక్స్ 100, మంగ‌ళ‌వారం చిత్రాల ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి (Ajay Bhupathi) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అశ్వినీద‌త్ (Aswini Dutt) నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా ఇప్ప‌టికే హీరో, హీరోయిన్లు, మోహ‌న్ బాబు (Mohanbabu) ఫ‌స్ట్ లుక్స్ రివీల్ చేయ‌గా మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

Srinivasa Mangapuram

ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాలో స్వ‌తంత్య్ర‌ బాబు (SWATANTRA BABU) అనే కీ రోల్ చేస్తున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్ (Naresh) లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో భుజాల‌పై రేడియో పెట్టుకుని స‌ర‌దాగా న‌వ్వుతూ ఉన్న ఈ ఫొటోను రిలీజ్ చేశారు.

ఇప్ప‌టికే న‌రేశ్‌న‌టించిన సినిమాలు ఈ ఏడాది నారీ నారీ న‌డుమ మురారి, హే బ‌ల‌వంత్ వంటి సిఇన‌మాలు విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించాయి. ఈ కోవ‌లోనే ఈ మూవీ సైతం విజ‌య భావుటా ఎగుర వేయ‌డం ఖాయ‌మ‌ని న‌రేశ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 01:26 PM