Secret Soldier : సరికొత్త స్పై థ్రిల్లర్.. ‘సీక్రెట్ సోల్జర్’ ట్రైలర్
ABN , Publish Date - Aug 29 , 2026 | 08:00 PM
నిహాల్ కోదాటి కీలక పాత్రలో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు
నిహాల్ కోదాటి కీలక పాత్రలో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ (Secret Soldier Trailer). సూర్య శ్రీనివాస్, హర్షిత, శ్రీషా, కమల్ కామరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తే దేశ రహస్యాలు, గూఢచర్యం, యాక్షన్ అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. సాధారణ స్పై కథలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.