Mythri Movies Distributors: మైత్రీ మూవీస్ చేతిలోకి 'సుమతీ శతకం'

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:28 PM

అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన 'సుమతీ శతకం' సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పంపిణీ చేయబోతోంది.

Sumathi Sathakam movie

సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'సుమతీ శతకం' (Sumathi Sathakam). అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary), శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, జెడీవీ ప్రసాద్, ఆకెళ్ళ గోపీకృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


తాజాగా 'సుమతీ శతకం' మూవీ నుండి 'సుమతీ... సుమతీ' అనే గీతాన్ని విడుదల చేశారు. కృష్ణ మాదినేని రాసిన ఈ పాటను గోల్డ్ దేవరాజ్ పాడారు. సుభాష్‌ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. 'నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ...' అంటూ సాగిన ఈ సాంగ్ విజువల్స్ చూస్తే అమర్ దీప్ తాను ప్రేమించిన అమ్మాయి గురించి పాడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పాటలోని డాన్స్ స్టెప్స్ కూడా సింపుల్ గా, సరికొత్తగా, ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి. ముందు ముందు యువత తమ ప్రేయసిని తలుస్తూ పాడేలా ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని అర్థం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'ఎక్కడే ఎక్కడే' పాటకు ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభిస్తోంది.

Updated Date - Jan 24 , 2026 | 01:33 PM