మెగా కోడలి సినిమా.. అప్పుడే ఓటీటీకా

ABN , Publish Date - May 17 , 2026 | 05:25 PM

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్ళి తరువాత నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సతీ లీలావతి (Sathi Leelavathi). దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు.

sathi leelavathi

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్ళి తరువాత నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సతీ లీలావతి (Sathi Leelavathi). దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల మధ్య మే 8 న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టిందని తెలుస్తోంది.


సతి లీలావతి సినిమా డిజిటల్ హక్కులకు సన్ నెక్స్ట్ కైవసం చేసుకుంది. మే 20 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మెగా కోడలి సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు కూడా కాకముందే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎంత డిజాస్టర్ మూవీస్ అయినా కూడా స్టార్ హీరోల సినిమాలు రెండు వారాల తరువాతనే ఓటీటీ బాట పడుతున్నాయి. లావణ్య సినిమా మరీ రెండు వారాలు కూడా నిండకుండానే రావడం దారుణమని అంటున్నారు.


ఇక పెళ్ళి తర్వాత భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలు, భావోద్వేగాలు, కెరీర్-ఫ్యామిలీ బ్యాలెన్స్ వంటి అంశాలతో ఈ మూవీ రూపొందింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరి ఓటీటీలో అయినా సతి లీలావతి హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Updated Date - May 17 , 2026 | 05:38 PM