లెజెండ్ శరవణన్.. అదరగొట్టాడుగా! 'లీడర్' టీజర్.. సూపర్
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:47 PM
లెజెండ్ మూవీతో తొలిసారి హీరోగా జనం ముందుకొచ్చిన ప్రముఖ తమిళ వ్యాపారవేత్త శరవణన్ ఇప్పుడు 'లీడర్'గా మారారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
లెజెండ్ శరవణన్ (Saravanana) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'లీడర్' (Leader). ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ (Payal Rajputh) గా నటిస్తోంది. 'లీడర్' సినిమా ఏప్రిల్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మార్చి 5న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
'లీడర్' మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే 'నా కూతురితో పాటే నేనుండాలి, దాని కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తాను' అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ఇది మొదలైంది. తన కుటుంబం కోసం చేసిన పోరాటంలో హీరో ఖైదీగా మారడం, జైలులో కూతురినే గుర్తు తెచ్చుకుంటూ బాధ పడటాన్ని చూపించారు. హీరో భార్యగా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.
ఈ అందమైన కుటుంబంలో ఎవరు తమ స్వార్థం కోసం చిచ్చు పెట్టారు అనేది టీజర్‌లో ఆసక్తి కలిగిస్తోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ అనే క్యారెక్టర్‌లో హీరో శరవణన్ ఇంటెన్స్ పర్‌ఫార్మెన్స్ కనబర్చారు. ఆయన చేసిన భారీ యాక్షన్ సీక్వెన్సులు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.