సంతోష్ శోభన్: 'సత్తిబాబు పరలోక యాత్ర' షురూ
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:54 PM
కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఉత్సాహంలో ఉన్న సంతోష్ శోభన్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'సత్తిబాబు పరలోక యాత్ర'.
ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో హిట్ అందుకున్నారు సంతోష్ శోభన్ (Santhosh shobhan) . థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుందీ సినిమా. తమిళనాట 50 రోజులు ప్రదర్శితమై విజయాన్ని దక్కించుకుంది. తెలుగు హీరో నటించిన సినిమా తమిళనాట 50 రోజులు ప్రదర్శితం కావడం అరుదైన విషయం. ఆ విధంగా సక్సెస్ జోష్ లో ఉన్న సంతోష్ శోభన్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన 'సత్తిబాబు పరలోక యాత్ర' (Sattibabu Paraloka yatra) చిత్రంలో నటిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ తెలుగు, తమిళంలో నిర్మిస్తోంది. 'స్వాతిముత్యం' సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.