Couple Friendly Trailer: ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశావ్ ..

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:52 PM

యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Couple Friendly Trailer

కుర్ర హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండగా.. అజయ్ కుమార్ రాజు పి నిర్మించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి (Manasa Varanasi) నటించింది. ఇప్పటికే కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వాలెంటెన్స్ డే కానుకగా కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోంటుంది. యువత త్వరగా కనెక్ట్ అయ్యే లివింగ్ టు గెదర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించిన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

శివ (సంతోష్ శోభన్) ఉద్యోగం లేకుండా తండ్రితో తిట్లు తింటూ పెరిగిన కుర్రాడు. వేరే ఊరిలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మిత్ర (మానస వారణాసి) కూడా జాబ్ కోసం అదే ఊరు వస్తుంది. ఇక అనుకోకుండా ఇద్దరు కలవడం, వారిమధ్య పరిచయం.. ఒకే ఊరిలో ఉద్యోగం కోసం వెతుకుతూ డబ్బు లేక ఒకే రూమ్ లో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం వారి జీవితాన్ని ఎలా మార్చింది.. ? లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్ళి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డారు? తల్లిదండ్రులను ఒప్పించి ఒక్కటయ్యారా? ఫ్రెండ్స్ గానే మిగిలిపోయారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సంతోష్ కి ఇలాంటి సినిమాలు కొత్తేమి కాదు. ఇది కూడా అలానే ఉంది. ఇక రొమాన్స్ సీన్స్ కు కొదవలేదనిపిస్తోంది. మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా ఉందని అంటున్నారు. వాలెంటెన్స్ డేకి ఈ సినిమా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో సంతోష్ శోభన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.

Updated Date - Feb 04 , 2026 | 07:52 PM