నీహారిక.. 'రాకాస' టీజ‌ర్‌ అదిరింది! ఈ సారి న‌వ్విస్తూనే.. భ‌య‌పెట్టించేలా ఉన్నారుగా

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:32 PM

మ్యాడ్ ఫేం సంగీత్ శోభ‌న్ ఫస్ట్ టైం సోలో హీరోగా.. న‌య‌న్ సారిక క‌థానాయిక‌గా మెగా డాట‌ర్ నీహారిక నిర్మించిన చిత్రం 'రాకాస' టీజ‌ర్ ను ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశారు.

Rakasa

మ్యాడ్ ఫేం సంగీత్ శోభ‌న్ (Sangeeth Shobhan) ఫస్ట్ టైం సోలో హీరోగా, ఆయ్‌, విష్ణు విన్యాసం ఫేమ్‌ న‌య‌న్ సారిక (Nayan Sarika) క‌థానాయిక‌గా మెగా డాట‌ర్ నీహారిక (Niharika Konidela) నిర్మించిన చిత్రం రాకాస (Rakasa). దీనికి మాన‌సా శ‌ర్మ (Manasa Sharma) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అనుదీప్ దేవ్ (Anudeep Dev) సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మ‌రో నెల రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్స్‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే విభిన్న శైలిలో ప్రమోష‌న్స్ చేస్తూ మూవీని జ‌నంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ చిత్రం నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్ సినిమాపై ఓ హైప్ క్రియేట్ చేశాయి.

అయితే.. తాజాగా ఆదివారం ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి, సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ చూస్తే ఔట్ అండ్ ఔట్ కామెడీ, హ‌ర్ర‌ర్, మిస్ట‌రీ జాన‌ర్‌లో తెర‌కెక్కించిన‌ట్లు అర్థమౌతోంది. ఓ పాడుప‌డ్డ భ‌వంతిలోకి హీరో, హీరోయిన్‌, వాళ్ల ఫ్రెండ్ వెళ్ల‌డం, అక్క‌డ జ‌రిగే ఘ‌ట‌న‌లు, భూత వైద్యుల స‌న్నివేశాలు అదిరిపోయాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్, ఇత‌ర విజువ‌ల్స్ హై స్టాండ‌ర్డ్‌ లో ఉన్నాయి. అంతేగాక మ‌ధ్య‌లో వ‌చ్చే పంచ్ డైలాగులు సైతం ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా టీజ‌ర్ చూస్తుంటే 'క‌మిటీ కుర్రాళ్లు' త‌ర్వాత నీహారికకు మ‌రో విజ‌యం ఖాయం అనేలా ఉంది. కాగా సినిమా ఏప్రిల్ 3న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది.

Updated Date - Mar 01 , 2026 | 07:05 PM