Sandigdham: ఆ ‘సందిగ్ధం’కు తెరపడేది ఆ రోజే!

ABN , Publish Date - May 12 , 2026 | 07:16 PM

వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సందిగ్ధం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Sandigdham

వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సందిగ్ధం’ (Sandigdham). నిహాల్ (Nihal), ప్రియా దేశ్ పాగ్ (Priya Deshapag), అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మిస్తున్నారు. పార్థసారధి కొమ్మోజు (Pardasaradhi Kommoju) దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేసింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెన్సార్ జరుపుకోనుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ని మేకర్స్ ప్రకటించారు.

Sandigdham

మే 29న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. సినిమా విడుదలలోపు భారీ ప్రమోషన్స్ నిర్వహించి, చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక విడుదల తేదీ ఫిక్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో సినిమాలో నటిస్తోన్న ప్రముఖ తారాగణం మొత్తాన్ని పరిచయం చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమనే విషయం తెలుస్తోంది. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా దర్శకుడు ఈ సినిమాను రూపొందించినట్లుగా కూడా అర్థమవుతోంది. మరి అసలు విషయం ఏంటి? అసలిందులో ఉన్న కంటెంట్ ఏంటి? అనే సందిగ్ధానికి తెరపడేది మాత్రం మే 29నే. అప్పటి వరకు వేచి చూడక తప్పదు. జీవా కొచెర్ల, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగిరెడ్డి, శ్రీదేవీ, దుర్గ, లక్ష్మీ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి గౌతమ్ రవి రామ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - May 12 , 2026 | 07:16 PM