Spirit: ప్రభాస్ కి పార్టీ సరే.. మరి ఫ్యాన్స్ కి ఏది
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:12 PM
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పండగలా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలంతా తమ డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తుండగా, మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్స్ నుంచి అప్డేట్లు వస్తాయని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురయ్యింది.
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పండగలా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ నుంచి సెలబ్రిటీలంతా తమ డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తుండగా, మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్స్ నుంచి అప్డేట్లు వస్తాయని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురయ్యింది. ఉదయం నుంచి ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ , స్పిరిట్ , సలార్ 2 సినిమాల నుంచి పోస్టర్స్ , వీడియోలు రిలీజ్ చేస్తారు అనుకున్నారు. ఇప్పటివరకుఫౌజీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. పోనీ స్పిరిట్ నుంచి అయినా ఒక పోస్టర్ వస్తుందేమో అనుకుంటే.. సందీప్ రెడ్డి వంగా ఒక అద్భుతమైన ఫోటోతో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పి షాక్ ఇచ్చాడు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్స్ నుంచి ఒక అదిరిపోయే ఫోటోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు బిగ్ కిక్ ఇచ్చాడు. ప్రభాస్ అన్నా.. ఇవాళ నీ బర్త్‌డే పార్టీ చేసుకుందాం అంటూ చేతిలో స్పిరిట్ బాటిల్ పట్టుకుని ఆయన విష్ చేసిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పోస్ట్‌లో ప్రభాస్ లుక్స్ అత్యంత స్టైలిష్‌గా, ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్గా ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్పిరిట్ అంటే కేవలం టైటిల్ మాత్రమే కాకుండా, మందు బాటిల్ అర్థం వచ్చేలా సందీప్ తనదైన మాస్ స్టైల్లో చేసిన ఈ విష్ చూసి ప్రభాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ, ఫ్యాన్స్ అందరూ స్పిరిట్ నుంచి ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తే ఇంకా బావుండేది కదా అని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ కి పార్టీసరే .. మాకు కూడా పోస్టర్ రిలీజ్ చేసి పార్టీ ఇచ్చి ఉంటే బావుండేది అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ సందీప్ రెడ్డి వంగా వదిలిన ఈ రేర్ పిక్, అందులోని మాస్ వైబ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద స్పిరిట్ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తుందోనని అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ - సందీప్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.