రోమాంచకం.. వంగా మార్క్ కనిపిస్తోందే
ABN , Publish Date - Jul 06 , 2026 | 09:24 PM
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి వైల్డ్ అండ్ సెన్సేషనల్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. చిన్న సినిమాలను నిర్మించి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు.
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి వైల్డ్ అండ్ సెన్సేషనల్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. చిన్న సినిమాలను నిర్మించి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఆయన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్న సరికొత్త తెలుగు చిత్రం రోమాంచకం(Romanchakam). మేమ్ ఫేమస్ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా నటిస్తుండగా, 8 వసంతాలు సినిమాతో మంచి గుర్తింపు అందుకొన్న అనంతిక హీరోయిన్‌గా నటిస్తోంది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ గ్లింప్స్ ఆద్యంత, ఆకట్టుకుంటుంది.
గ్లింప్స్ విషయానికి వస్తే.. జానకి చెంతనే రాముని హృదయం.. ఈ ప్రేమ కావ్యం మృదుమధురం అనే ఒక అందమైన మెలోడీ సాంగ్ తో గ్లింప్స్ ఎంతో రోమాంటిక్‌గా మొదలయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, బైక్ రైడ్స్, సముద్ర తీరంలో పరుగులు.. ఇలా విజువల్స్ అన్నీ చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తాయి. అంతా బావుంది అనుకొనేలోపు హీరో హీరోయిన్లు ఒకరినొకరు కొట్టుకుంటూ, ఐ హేట్ యూ అని చెప్పుకోవడంతో ఈ సినిమాలో వంగా మార్క్ ఉందని అర్దమవుతోంది. ఒక చిన్న గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు వంగా.
లవ్, కామెడీ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ రోమాంచకం సినిమా వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా పేరు ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అవ్వడంతో సినిమాపై ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి ఈ సినిమాతో వంగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.