సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని: ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏం తగ్గడు.. నా కొడుకు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:40 PM

శివాజీ (Sivaji), లయ (Laya) జంటగా సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని (Sampradayini Suppini Suddapoosani).

Sampradayini Suppini Suddapoosani

శివాజీ (Sivaji), లయ (Laya) జంటగా సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని (Sampradayini Suppini Suddapoosani). శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ శొంఠినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు రోహన్, ఆలీ, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ని విడుదలచేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

శివాజీ, లయ కాంబినేషన్ లో వస్తున్న ఐదవ సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. శ్రీరామ్ పాత్రలో శివాజీ నటిస్తున్నారు. భార్య, కొడుకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా శివాజీ కనిపించారు. ఎంతో గౌరవంగా ఉండే శ్రీరామ్ తన భార్య, కొడుకు వలన ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? అసలు భార్య, కొడుకు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

'కోర్టు' సినిమా తరువాత శివాజీకి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఆయన విలన్ గానే కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. సాంప్రదాయని సుప్పిని సుద్దపూస చిత్రంలో అమాయకమైన భర్తగా శివాజీ నటన హైలైట్ గా నిలవనుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత ఆలీ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. జబర్దస్త్ నటులు చాలామంది ఈ సినిమాలో నటించారు. మొదటి నుంచి పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం థియేటర్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Mar 02 , 2026 | 06:20 PM