షాకింగ్.. బేబీ బంప్‌తో సమంత..?

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:32 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) తల్లి కాబోతుందని రెండు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత నిజంగానే ప్రెగ్నెంటా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

Samantha

టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) తల్లి కాబోతుందని రెండు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత నిజంగానే ప్రెగ్నెంటా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ అనుమానాలకు ఒక క్లారిటీ వచ్చేసింది. మొదటిసారి బేబీ బంప్ తో సామ్ దర్శనమిచ్చింది. ఆమె నటించిన మా ఇంటి బంగారం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకున్న విషయం తెల్సిందే. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు. టాక్ ఎలా ఉన్నా కూడా సామ్ బంగారం మంచి కలక్షన్స్ రాబట్టింది. కొంతమంది స్టార్ హీరోలు కూడా రాబట్టలేని కలక్షన్స్ సామ్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక బంగారం హిట్ టాక్ రావడంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సామ్, రాజ్ చేత చిత్రబృందం కేక్ కట్ చేయించారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అందరి చూపు సామ్ మీదనే ఉంది. వైట్ టీషర్ట్, జీన్స్ ధరించిన సమంత బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా సామ్ కూడా చాలా జాగ్రత్తగా బేబీ బంప్ ని హ్యాండ్ తో కవర్ చేస్తూ కనిపించడంతో అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సమంత కచ్చితంగా ప్రెగ్నెంట్ అని క్లారిటీ వచ్చేసింది. దీంతో అభిమానులు సామ్ కి, రాజ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో రాజ్ నిడిమోరును వివాహమాడింది. అక్కినేని నాగచైతన్యతో విడిపోయాకా.. ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే వస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే సామ్ జీవితంలో కొత్త వెలుగు రానుంది. మా ఇంటి బంగారం తరువాత సామ్ సినిమాలు చేయడం తగ్గించనుందని సమాచారం. తల్లి అయ్యాక కూడా సామ్ సినిమాలు చేస్తుందా.. ? నిర్మాతగా కొనసాగుతోందా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 20 , 2026 | 04:50 PM