ప్రెగ్నెన్సీలో సమంతకు వింత సమస్య..

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:33 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత (Samantha).. గతేడాది ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Samantha

దక్షిణాది చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత (Samantha).. గతేడాది ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ప్రస్తుతం తమ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. సమంత ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం కూడా విదితమే. ఈ ఆనందకరమైన సమయంలో ఆమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ, తన ప్రెగ్నెన్సీ డైరీస్ పేరుతో రోజువారీ విశేషాలను, అనుభవాలను అభిమానులతో క్రమం తప్పకుండా పంచుకుంటుంది.


గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల మహిళలకు దుస్తుల ఎంపిక విషయంలో రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి దుస్తులు సరిపోకపోవడం. ఇది ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళకు ఎదురయ్యే సమస్యణే. సరిగ్గా ఇలాంటి సరదా అనుభవాన్నే సమంత ఇటీవల ఎదుర్కొంది. తాను వేసుకునే వార్డ్‌రోబ్‌లోని పాత దుస్తులు ఏవీ తనకు ఇప్పుడు సరిపోవడం లేదనే విషయాన్ని ఆమె తాజాగా గ్రహించింది. అద్దం ముందు నిలబడి దిగిన ఒక క్యూట్ మిర్రర్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రెగ్నెన్సీ అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది.


'నా వార్డ్‌రోబ్‌లోని ఎక్కువ శాతం దుస్తులు ఇక నాకు సరిపోవడం లేదని తెలిసి మినీ హార్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తరువాత వెంటనే రెండు సెకన్ల పాటు చిన్నపాటి భయం, కంగారు కలిగాయి. కానీ ఆ భావోద్వేగం కేవలం రెండు సెకన్లు మాత్రమే ఉంది. వెంటనే తేరుకుని, ప్రస్తుతం నాకు సరిపోతున్న ఓ రెండు జతల దుస్తులతోనే హాలిడేకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను" అంటూ సమంత ఆ ఫోటోకు సరదాగా క్యాప్షన్ జోడించింది. దుస్తులు పట్టడం లేదని చింతించకుండా, ఉన్న రెండు జతల బట్టలతోనే హాయిగా వెకేషన్‌కు బయలుదేరిన సమంత స్టైల్ అండ్ ఆటిట్యూడ్‌కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Updated Date - Aug 14 , 2026 | 03:51 PM