Samantha: సమంత ఛాలెంజ్.. ఎవరైనా ఆమెలా చేయగలరా

ABN , Publish Date - Jan 23 , 2026 | 08:15 PM

టాలీవుడ్‌ నటి సమంత (Samantha) డెడికెషన్, పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ బ్రేవ్ ఉమెన్ అనిపించుకుంటోంది.

Samantha

Samantha: టాలీవుడ్‌ నటి సమంత (Samantha) డెడికెషన్, పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ బ్రేవ్ ఉమెన్ అనిపించుకుంటోంది. అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya)తో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది సమంత. అయినప్పటికీ, ధైర్యంగా పోరాడి మళ్లీ బలంగా నిలబడింది. కొంతకాలం తర్వాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను వివాహమాడి మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టి బాగా బిజీగా మారింది. కేవలం నటిగానే కాకుండా బిజినెస్ విమెన్ గా, నిర్మాతగా, పాడ్ క్యాస్ట్ హోస్ట్ గా ఇలా అన్నింటిని మేనేజ్ చేస్తూ సక్సెస్ ఫుల్ విమెన్ అనిపించుకుంటుంది.

సినిమాల గురించి పక్కన పెడితే సమంత ఒక ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న విషయం అందరికి తెల్సిందే. సామ్ అన్నం లేకుండా అయినా ఉండగలదు కానీ, జిమ్ చేయకుండా మాత్రం అస్సలు ఉండలేదు. సామ్ లా జిమ్ లో కసరత్తులు చేసే హీరోయిన్స్ ఉన్నా కానీ, ఆమెలా అయితే ఎవరూ చేయలేరు అని చెప్పొచ్చు. ఎప్పుడూ జిమ్‌లో యాక్టివ్ గా ఉండే సమంత.. తాజాగా ఓ ఫిటెనెస్ ఛాలెంజ్ ను విసిరింది. తన ఫిట్‌నెస్ ట్రైనర్ ఇచ్చిన ఒక సవాలును సామ్ ఈజీగా పూర్తి చేసింది.

ఇది సాధారణ పుష్-అప్ కాకుండా, శరీరాన్ని ముందుకు-వెనక్కు కదిలిస్తూ, ఎడమ చేయిని కుడి కాలికి, కుడి చేయిని ఎడమ కాలికి తాకాలి.. అది కూడా నేలకు తాకకుండా చేయాలి. అలా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోకి అద్భుతమైన క్యాప్షన్ ను కూడా జోడించింది. 'ఒక లక్ష్యంతో ఉన్న మహిళను మించిన వారు ఎవరూ లేరు' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామ్ వీడియో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వాట్ ఏ ఫిట్ నెస్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సామ్ సినిమాల సంగతికి వస్తే.. ప్రస్తుతం తన స్వంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ద్వారా 'మా ఇంటి బంగారం' చిత్రానికి సహ నిర్మాతగా పనిచేస్తూ.. ప్రధాన పాత్రలో కూడా నటిస్తోంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్‌లో ఆమె యాక్షన్ సీన్లు అద్భుతంగా కనిపించాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jan 23 , 2026 | 08:17 PM