స‌మంత‌.. 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:30 PM

సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత లీడ్ రోల్‌లో న‌టిస్తూ నిర్మించిన చిత్రం మా ఇంటి బంగారం.

samantha

సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) లీడ్ రోల్‌లో న‌టిస్తూ నిర్మించిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). ఓ బేబీ, అలా మొద‌లైంది చిత్రాల ఫేమ్ నందిని రెడ్డి (Nandini Reddy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత పెళ్లి చేసుకున్న అనంత‌రం షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది.

samantha

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన టీజ‌ర్ ఓ రేంజ్‌లో ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుని సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా క్యూరియాసిటీని పెంచేసింది. అయితే.. తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ కీల‌క అప్డేట్ ఇచ్చారు. సినిమాను వేస‌వి సెల‌వుల దృష్ట్యా మే 15న థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఆ పోస్ట‌ర్ సైతం రిలీజ్ చేశారు.

Updated Date - Feb 22 , 2026 | 04:30 PM