Samantha: పెళ్లి తరువాత బాపు బొమ్మలా మెరుస్తున్న సామ్.. ఇంతందంగా ఉందేంట్రా

ABN , Publish Date - Jan 10 , 2026 | 07:55 PM

పెళ్లి తరువాత అమ్మాయిల అందం రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొత్త జీవితం, ప్రేమించిన వ్యక్తి.. కొత్త వాతావరణం.. ఇవన్నీ కూడా అమ్మాయి అందాన్నీ మరింత పెంచుతాయట.

Samantha

Samantha: పెళ్లి తరువాత అమ్మాయిల అందం రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కొత్త జీవితం, ప్రేమించిన వ్యక్తి.. కొత్త వాతావరణం.. ఇవన్నీ కూడా అమ్మాయి అందాన్నీ మరింత పెంచుతాయట. ప్రస్తుతం అందాల భామ సమంత (Samantha) కూడా అదే కోవలో చేరింది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాకా.. సామ్ ముఖంలో లేని వెలుగు.. రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లి అయ్యాక వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ లేని విధంగా సామ్ ముఖంలో ఏదో తెలియని ఒక షైన్ కనిపిస్తుంది.

పెళ్లి తరువాత సమంత నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఓ బేబీ లాంటి హిట్ సినిమా తరువాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న రెండో చిత్రం. ఈ చిత్రాన్ని సామ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాకు రాజ్ నిడిమోరు కూడా స్టోరీలో హెల్ప్ చేస్తున్నాడు. తాజాగా మా ఇంటి బంగారం టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. చీరకట్టిన శివంగిలా సామ్ యాక్షన్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అమ్మడిని ఈ రేంజ్ లో చూసి చాలా కాలం అయ్యింది అని చెప్పొచ్చు.

ఇక మా ఇంటి బంగారం టీజర్ బాగా సక్సెస్ అవ్వడంతో సామ్ అభిమానులకు థాంక్స్ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా సామ్ .. బాపు బొమ్మలా మెరిసింది. బాపు బొమ్మల సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి.. ఒక అందమైన బాపు బొమ్మగా రెడీ అయ్యింది. పింక్ కలర్ బ్లౌజ్.. వైటర్ కలర్ చీర.. నీట్ గా జడ వేసుకొని.. చిన్న ముత్యాల హారాన్ని ధరించి ఎంతో అందంగా ముస్తాబు అయ్యింది. నిజంగా పెళ్లి తరువాత ఆమెలో మరింత వెలుగు వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ ఫోటోలకు మరెంతో అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. ' బాపు బొమ్మల సిరీస్ — సున్నితత్వాన్ని శక్తివంతంగా, సరళతను మరపురానిదిగా మార్చిన కళాకారుడికి అంకితం' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 10 , 2026 | 08:10 PM