Samantha: అయ్యో.. బంగారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదే
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:51 PM
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ సినిమా వస్తోంది అంటే చాలు.. అది ఎలా ఉన్నా కూడా ఫ్యాన్స్ హిట్ చేసేవారు.
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టంగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ సినిమా వస్తోంది అంటే చాలు.. అది ఎలా ఉన్నా కూడా ఫ్యాన్స్ హిట్ చేసేవారు. కానీ, ఇప్పటి జనరేషన్ అలా కాదు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే కంటెంట్ ఉంటేనే హిట్ చేస్తున్నారు. కంటెంట్ తో పాటు ప్రమోషన్స్ ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలు సైతం సరికొత్తగా ప్రచారాలు చేస్తూ తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మాత్రం తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అని టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న తాజా చిత్రం మా ఇంటి బంగారం. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 15 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ ఇంకా పట్టుమని 15 రోజులు కూడా లేదు.. కానీ, ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. ఒకప్పుడు సామ్ సినిమా రిలీజ్ అంటే ఆ బజ్ వేరే లెవెల్ లో ఉండేది. కానీ, ఇప్పుడు అలా లేదు.
రాజ్ నిడిమోరుతో పెళ్ళి తరువాత సామ్ ఒకపక్క నిర్మాతగా.. ఇంకోపక్క హీరోయిన్ గా చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఓ బేబీ లాంటి హిట్ తరువాత సామ్- నందినిరెడ్డి కాంబోలోవస్తోన్న చిత్రం కావడంతో ఓ రేంజ్ లో బజ్ ఉంటుంది అనుకున్నారు. అయితే సామ్ మాత్రం ప్రమోషన్స్ చేయడంలో విఫలమయ్యారు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క ప్రమోషన్ ఇంటర్వ్యూ తప్ప ఇంకేమి రాలేదు. వెన్నెల కిషోర్ - సామ్ ఇంటర్వ్యూ రిలీజ్ అయినా కూడా అదేమీ అంతగా ఆసక్తి రేకెత్తించలేదు అని టాక్. అందుకనే ప్రేక్షకులు సైతం మా ఇంటి బంగారం సినిమాను పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరి ఇప్పటికైనా సామ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించకపోతే సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందే అని పలువురు చెప్పుకొస్తున్నారు.