ప్రెగ్నెన్సీలోనూ జిమ్‌లో చెమటలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:24 PM
నిజంగానే బంగారం అంటున్నారు సమంతను చూసి అభిమానులు. కష్టమైన సమయంలోనూ ఆమె పడుతున్న శ్రమను చూసి తెగ మెచ్చుకుంటున్నారు. సమంతకు మాత్రమే ఇది సాధ్యం అని ఆకాశానికెత్తుతున్నారు. ఇంతకీ అంతలా సమంత ఏం చేసిందో తెలుసా!?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం నటనతోనే కాదు... తన అద్భుతమైన ఫిట్‌నెస్‌తోనూ మిలియన్ల మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఒక జిమ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆమె చూపిస్తున్న డెడికేషన్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. 'సమంత నిజంగానే బంగారం' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో సమంత బేబి బంప్ తో ట్రైనర్ సాయంతో కఠినమైన వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్ట్రాప్స్ పట్టుకుని, వెనక్కి వాలుతూ తన బాడీ వెయిట్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఆమె చేసిన ఎక్సర్‌సైజ్ అంత ఈజీ కాదు. చేతులు, భుజాలు, వీపు, కాళ్లను బలంగా మార్చే ఈ వర్కౌట్‌ను సమంత ఎంతో గ్రేస్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా పూర్తి చేసింది. ఈ ఎక్సర్‌సైజ్ ద్వారా ప్రెగ్నెన్సీలోనూ యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండాలనే సమంత డెడికేషన్ కనిపిస్తోందని అందరూ పొగుడుతున్నారు.
ఫిట్టెడ్ బ్రౌన్ వర్కౌట్ ఔట్‌ఫిట్‌లో సమంత లుక్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. ఇటీవలే 'మా ఇంటి బంగారం' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్. ఈ సినిమా 92 కోట్ల గ్రాస్ ను ఇప్పటికే వసూలు చేయడం విశేషం. ఆ సక్సెస్ జోష్‌ను ఎంజాయ్ చేస్తూనే ఇలా జిమ్‌లో చెమటోడుస్తోంది. కష్టాన్నైనా నవ్వుతూ ఇష్టంగా మార్చుకునే సమంత డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఇవి కూడా చదవండి:
దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!
72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?
National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!