మా ఇంటి బంగారం.. భర్తతో హోళీ భలే ఆడిందే

ABN , Publish Date - Mar 04 , 2026 | 07:57 PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) సినిమాతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నారు.

Maa Inti Bnagaaram

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) సినిమాతో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. మే 16 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తాజాగా మా ఇంటి బంగారం సెట్ లో హోళీ వేడుకలు నిర్వహించారు. సామ్ పెళ్ళి తరువాత వచ్చిన మొదటి హోళీ కావడంతో .. సెట్ లోనే సామ్.. తన భర్తతో ఈ పండగను జరుపుకున్నారు. సెట్ లో.. సామ్, భర్త రాజ్ పై, డైరెక్టర్ నందినిపై రంగులు చల్లుతూ కనిపించారు. సీక్రెట్ గా వెనుక నుంచి వచ్చి సామ్ .. రాజ్ పై రంగులు చల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు చాలా క్యూట్ ఉన్నారు.. అందమైన జంట అని కామెంట్స్ పెడుతున్నారు.

అక్కినేని నాగ చైతన్యతో విడిపోయాక సామ్.. కొన్నేళ్లు రాజ్ తో డేటింగ్ చేసి.. సమంత గతేడాది చివర్లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత సమంతలో చాలా మార్పు వచ్చింది. ఆమె ముఖంలో గ్లో వచ్చిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. పెళ్లి తరువాత సామ్ నుంచి మొదటి చిత్రం మా ఇంటి బంగారం ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Mar 04 , 2026 | 07:59 PM