Samantha: పెళ్లి తరువాత మొదటి సంక్రాంతి.. సామ్ ఎలా జరుపుకుందంటే
ABN , Publish Date - Jan 15 , 2026 | 07:09 PM
సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటున్నాయి.
Samantha: సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటున్నాయి. అల్లుళ్ళ హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా సంక్రాంతిని అద్భుతంగా జరుపుకుంటున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. పెళ్లి తరువాత మొదటి సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.
గతేడాది చివర్లో సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరును చాలా సింపుల్ గా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. గతంలో ఎన్నో బాధలను అనుభవించిన సామ్.. ఈ పెళ్లి తరువాత సంతోషంగా కనిపిస్తుంది. ముఖంలో కూడా ఆ వెలుగు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా నేడు సంక్రాంతి పండగను భర్తతో కలిసి సామ్ జరుపుకుంది. కారులో టెంపుల్ కి వెళ్లి వస్తున్న ఫోటోను అభిమానులతో షేర్ చేస్తూ.. సంక్రాంతి వైబ్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. సామ్.. క్యూట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మా ఇంటి బంగారం ఈ ఏడాదిలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి చాలా గ్యాప్ తరువాత వస్తున్న సామ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.