ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి కార్తీక్ అవుట్.. కారణమేంటి

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:08 PM

పెళ్లి చూపులు లాంటి హిట్ తరువాత డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) నుంచి వచ్చిన మరో ఆణిముత్యం ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi).

ENE2

ENE2: పెళ్లి చూపులు లాంటి హిట్ తరువాత డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) నుంచి వచ్చిన మరో ఆణిముత్యం ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi). విశ్వక్ సేన్ (Vishwak Sen), సాయి సుశాంత్,(Sai Sushanth) అభినవ్ గోమటం, వెంకటేష్ కాకమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 లో రిలీజ్ అయ్యింది. అయితే అప్పుట్లో ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. యువత దృష్టిలో మాత్రం ఈ నగరానికి ఏమైంది ఒక కల్ట్ క్లాసిక్. నలుగురు స్నేహితులు.. వారి మధ్య బాండింగ్, కాలేజ్ లో వారు చేసిన అల్లరి.. ఇలా ప్రతిదీ యూత్ ని చాలా ఆకట్టుకుంది. ఆ నలుగురు స్నేహితుల్లో తమను తాము చూసుకుంటామని చాలామంది ఇప్పటికీ చెప్పుకొస్తుంటారు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురావాలని ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ పై ఒత్తిడి కూడా తెచ్చారు. ఫ్యాన్స్ కోసం తరుణ్.. ఎట్టకేలకు ఈNఈ రీపీట్ పేరుతో గతేడాది తరుణ్ భాస్కర్ సీక్వెల్ ని అధికారికంగా ప్రకటించాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. తరుణ్ భాస్కర్ ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క ఈ సీక్వెల్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుంది అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సడెన్ ట్విస్ట్ లా ఒక వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి సాయి సుశాంత్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏమైందో ఏమో తెలియదు కానీ కార్తీక్ పాత్ర చేసిన సాయి సుశాంత్ సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతని స్థానంలో శ్రీనాథ్ మాగంటి నటిస్తున్నాడని అంటున్నారు. హిట్ 2, లక్కీ భాస్కర్ సినిమాలతో శ్రీనాథ్ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో అతను కార్తీక్ స్థానంలో నటిస్తే మరింత గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు. కానీ, వివేక్, కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర పాత్రల్లో ఏ ఒక్క పాత్ర సీక్వెల్ లో లేకపోయినా . ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. అది సీక్వెల్ కూడా అనిపించుకోదు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Updated Date - Jan 21 , 2026 | 04:17 PM