గరివిడి లక్ష్మీ.. ఇంతమంది హీరోయిన్స్ వద్దన్నారా

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:54 PM

ఉత్తరాంధ్ర ప్రసిద్ధ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi) నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం గరివిడి లక్ష్మీ. 

Garividi Lakshmi

ఉత్తరాంధ్ర ప్రసిద్ధ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi) నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం గరివిడి లక్ష్మీ.  ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య  అక్టోబర్ 17 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. జానపద కళల గొప్పతనాన్ని, ఒక అసాధారణ మహిళా కళాకారిణి పడిన కష్టాలను, ఆమె ప్రయాణంలోని ఒడిదుడుకులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. మహానటిని తలపించేలా సాగే ఈ కథ ప్రేక్షకులను ఎమోషనల్ గురిచేసే ప్రయత్నం చేసింది.


తాజాగా ఈ సినిమా విజాయ్త్సవ సభలో  టైటిల్ రోల్ కోసం దర్శకుడు ముందుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, నివేతా థామస్, నిత్యా మీనన్‌లను సంప్రదించినట్లు తెలిపాడు.  అయితే వివిధ కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోవడంతో ఆ అవకాశం టాలెంటెడ్ నటి ఆనందిని వరించిందని, ఆమె ఈ పాత్రకు న్యాయం చేసినట్లు తెలిపాడు. ఆనంద్ కూడా ఒక ఇంటర్వ్యూలో గరివిడి లక్ష్మీ లాంటి జానపద కళాకారిణి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఈ సినిమాలో నటించినట్లు తెలిపింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆనందికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.


లక్ష్మీ జీవితంలోని ఎత్తుపల్లాలు, నమ్మినవాళ్ల చేతిలో మోసపోవడం, చివరికి అనాథగా మిగిలిపోవడం వంటి భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. చరణ్ అర్జున్ అందించిన జానపద పాటలు థియేటర్లలో మంచి ఊపును ఇచ్చాయి. ఈ చిత్రానికి పలువురు ప్రముఖుల నుంచి కూడా అభినందనలు లభించాయి. అయితే బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే, ఈ సినిమా కమర్షియల్ పరంగా భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఒక కంటెంట్ ఓరియెంటెడ్ బయోపిక్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొంత పరిమితంగానే నమోదయ్యాయి. అయినప్పటికీ, కాలగర్భంలో కలిసిపోతున్న ఒక గొప్ప జానపద కళాకారిణి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించి, ఆమెకు తగిన గుర్తింపు తెచ్చిన చిత్రంగా గరివిడి లక్ష్మీ నిలిచింది.

Updated Date - Oct 23 , 2026 | 02:56 PM