తెలుగులోనూ వ‌స్తున్న.. సాయి ప‌ల్ల‌వి ఫ‌స్ట్ హిందీ సినిమా! 'ఒక రోజు'.. మూవీ ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:10 PM

అమీర్ ఖాన్ త‌న‌యుడు జునైద్ ఖాన్ ( Junaid Khan) హీరోగా లేడీ ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) హిందీ తెరంగేట్రం చేస్తూ తెర‌కెక్కిన చిత్రం ఎక్ దిన్.

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న‌యుడు జునైద్ ఖాన్ ( Junaid Khan) హీరోగా లేడీ ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) హిందీ తెరంగేట్రం చేస్తూ తెర‌కెక్కిన చిత్రం ఎక్ దిన్ (Ek Din). ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్ అన్నీ అద్భుత‌మై ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని సినిమాపై మంచి అంచ‌నాల‌ను రాబ‌ట్టింది. అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ (Aamir Khan Productions) బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి సునీల్ పాండే (Sunil Pandey) ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. రామ్ సంప‌త్ ( Ram Sampath) సంగీతం అందించాడు.

అయితే.. తాజాగా ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఈ చిత్రం పేరును ఒక రోజు (Oka Roju) గా ప్ర‌క‌టిస్తూనే ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను చూస్తే హీరో తాను ప్రేమించిన అమ్మాయితో ఒక రోజంతా ప్రేమ‌గా ఉండాల‌ని, ఆమె ప్రేమ‌ను ద‌క్కించుకోవాల‌ని ఆశ ప‌డుతూ ఉంటాడు. అలాంటి స‌మ‌యంలో క‌థానాయిక అత‌నితో ద‌గ్గ‌ర కావ‌డం ఆపై జ‌రిగే ప‌రిణామాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. అలాగే చివ‌ర‌లో హీరోయిన్‌కు గ‌డిచిన రోజు గుర్తుండ‌దనేలా ఇచ్చిన ట్విస్టు ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఇదిలాఉంటే.. తెలుగు డ‌బ్బింగ్ అంతా ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయిన‌ప్ప‌టికీ.. సాయి ప‌ల్ల‌వికి మాత్రం డ‌బ్బింగ్ కొత్త వారితో చెప్పించ‌డం జ‌నాల‌కు ఏ మాత్రం ఎక్కుతుందో చూడాలి. కాక‌పోతే.. సాయి ప‌ల్ల‌వికి తెలుగు నాట‌ స్టార్ హీరోల స్థాయిలో అభిమానులు, ఫాలోయింగ్ , ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉండ‌డం ఈ సినిమాకు క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మూవీ టాక్ కాస్త బావున్నా సింఫుల్‌గా త‌క్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా అవ‌డంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో హైప్స్ అమాంతం పెరిగాయి.

Updated Date - Mar 24 , 2026 | 09:10 PM