సాయి మాధవ్‌ బుర్రా: నా కథను మానభంగం చేశారు..

ABN , Publish Date - Mar 06 , 2026 | 08:12 PM

నటిగా విభిన్న పాత్రలు పోషించి సౌత్‌ ప్రేక్షకుల్ని మెప్పించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ‘సరస్వతి’ సినిమాతో దర్శకురాలిగా మారింది.

Varalaxmi

నటిగా విభిన్న పాత్రలు పోషించి సౌత్‌ ప్రేక్షకుల్ని మెప్పించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalakshmi sarathkumar) ‘సరస్వతి’ సినిమాతో దర్శకురాలిగా మారింది. బన్నీ వాసు, ఈటీవీ విన్‌ సపోర్ట్‌తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఈ మూవీపై రచయిత సాయి మాధవ్‌ బుర్రా (Sai madhav burra) అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సినిమాకు కథ ఆయనదే. ఆయన దర్శకత్వం వహించాలని ఈ కథ సిద్ధం చేసుకున్నారు. పలు కారణాల వల్ల ఆయన డైరెక్ట్‌ (saraswathi) చేయలేకపోయారు. దాంతో ఈ కథ వరలక్ష్మీ చేతికి వెళ్లింది. అయితే ఈ సినిమాకి రచయితగా క్రెడిట్‌ ఇచ్చారు. కానీ ప్రమోషన్స్‌లో ఆయన ప్రస్తావన ఎక్కడా లేదు.

దీనిపై సాయిమాధవ్‌ స్పందించారు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్‌ డ్రామా కాదు. నా సోల్‌ వేరు.. అసలా కథే వేరు’ అని సాయి మాధవ్‌ బుర్రా పోస్ట్‌లో పేర్కొన్నారు. మరి దీనిపై దర్శకురాలు వరలక్ష్మీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Burra.jfif

Updated Date - Mar 08 , 2026 | 07:22 AM