సాయి దుర్గా తేజ్‌.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అస‌లు త‌గ్గ‌ట్లేగా

ABN , Publish Date - Apr 04 , 2026 | 08:42 PM

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి దుర్గ తేజ్. ఒకప్పుడు పక్కా మాస్, కమర్షియల్ సినిమాలతో అలరించిన ఈ సుప్రీం హీరో.. ఇప్పుడు కంప్లీట్ గా తన గేర్ మార్చేశాడు.

Sai Durga Tej

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి దుర్గ తేజ్. ఒకప్పుడు పక్కా మాస్, కమర్షియల్ సినిమాలతో అలరించిన ఈ సుప్రీం హీరో.. ఇప్పుడు కంప్లీట్ గా తన గేర్ మార్చేశాడు. ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ అంటే కేవలం డాన్సులు, ఫైట్లు, పక్కా కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. 'పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్' వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. అయితే, యాక్సిడెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తేజ్.. తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ విషయం మనందరికీ స్పష్టంగా కనిపిస్తోంది, కేవలం బాక్సాఫీస్ లెక్కలే కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలకే ఆయన ఓటు వేస్తున్నాడు. దీనికి నిదర్శనమే 'రిపబ్లిక్' సినిమా. ఒక సోషల్ డ్రామాతో తనలోని సీరియస్ నటుడిని పరిచయం చేసిన తేజ్.. ఆ తర్వాత 'విరూపాక్ష'తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మిస్టిక్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. కేవలం మాస్ మసాలా ఎలిమెంట్స్ ను నమ్ముకోకుండా.. కథను, స్క్రీన్ ప్లేని నమ్ముకుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా నిరూపించింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతోనే తేజ్ తన తదుపరి చిత్రాలను కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.


ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'సంబరాల యేటి గట్టు'. ఈ సినిమా టైటిల్ వినగానే ఇదొక పీరియాడిక్ డ్రామా అని అర్థమవుతోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్ర దర్శకుడు రోహిత్ ఒక కొత్తవాడు. కథ మీద నమ్మకంతో, దర్శకుడు కొత్తవాడైనా పాతవాడైనా సంబంధం లేకుండా అవకాశమిస్తూ ముందుకు సాగుతున్నాడు తేజ్. అంతేకాకుండా, తన పేరులో తన తల్లి పేరును కూడా జోడించి ఒక ఎమోషనల్ బాండింగ్‌ను చాటుకున్నాడు.

తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ తో తేజ్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఒక భారీ మిస్టిక్ థ్రిల్లర్‌ను అనౌన్స్ చేశాడు. 'క' చిత్రంతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న దర్శకులు సుజిత్, సందీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. యుగాలుగా బయటకు రాని రహస్యాలు.. ఊహకందని శక్తులు అనే క్యాప్షన్ తో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.

ఈ సినిమాతో తేజ్ మళ్ళీ మిస్టిక్ జోనర్ లో మరో వండర్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ లో విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా హై రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తానికి మెగా మేనల్లుడు మాస్ రూట్ నుంచి మారి కొత్త జోనర్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు. కేవలం హిట్లే కాదు, తెలుగు సినిమా స్థాయిని పెంచే కథలను ఎంచుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం.

Updated Date - Apr 04 , 2026 | 08:53 PM