దైవ తన్మయత్వంలో.. సెలబ్రిటీలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:43 PM
ఇటీవల కోయంబత్తూరులోని సద్గురు ఇషా పౌండేషన్ లో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
ఇటీవల కోయంబత్తూరు (Coimbatore) లోని సద్గురు (Sadhguru) ఇషా పౌండేషన్ (Isha Foundation) లో మహా శివరాత్రి (Mahashivratri) ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ గాయకులు, సంగీతకారులు సైతం విచ్చేసి అక్కడికి వచ్చిన వారిని భక్తి తన్మయత్వంలో ఓలలాడించారు.
కాగా ఈ ఈవెంట్‌లో అనేక మంది ఫిల్మ్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు. ముఖ్యంగా సారా అర్జున్ (Sara Arjun), తమన్నా (Tamannaah Bhatia), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), మౌనీ రాయ్ వంటి అగ్ర కథానాయికలు కూడా పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
అంతేగాక అక్కడి ప్రకృతి సోయగల నడుమ వీరంతా సేద తీరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా హిట్ మూవీ బ్యూటీ శ్రీ నిధి శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.