విడాకుల అనంతరం.. అక్కడ కనిపించిన పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:08 PM

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. పవన్ తన మూడో భార్య అన్నా లెజ్నెవాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో మొత్తం నేషనల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Pawan Kalyan

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. పవన్ తన మూడో భార్య అన్నా లెజ్నెవాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో మొత్తం నేషనల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు 13 ఏళ్ల వివాహబంధం తరువాత ఈ జంట విడకూలను ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పరం విడిపోతున్నామని, తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. తల్లిదండ్రులగా మాత్రం తాము ఎప్పుడు బాధ్యతలను మరవమని స్పష్టం చేశారు. దీంతో ఉదయం నుంచి పవన్ పేరు ట్రెండింగ్ నెంబర్ 1 గా మారింది. అయితే ఈ పోస్ట్ ఏ హ్యాండిల్ నుంచి వచ్చిందో మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందించింది లేదు.


ఇక పవన్ విడాకుల వార్తతో సోషల్ మీడియా అట్టుడిగిపోతుంటే.. ఆయన మాత్రం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కీలక కేబినెట్ సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి పవన్ కళ్యాణ్ ఎంతో చురుగ్గా, నిబద్ధతతో ఈ ఉన్నత స్థాయి భేటీలో పాల్గొన్నారు. సచివాలయంలో ఉదయం సమయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా ఎజెండా అంశాలపై మంత్రివర్గ సహచరులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాల కల్పన, యానిమేషన్, విఎఫ్ఎక్స్ , రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, సెమికండక్టర్ ఫ్యాబ్ వంటి రంగాల్లో నూతన పాలసీల రూపకల్పనతో పాటు భారీ డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.


ఇక ఈ కేబినెట్ సమావేశంకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఏ మీటింగ్ అయినా పవన్ ముఖంలో చిరునవ్వు చెరగదు. కానీ, ఈసారి మాత్రం పవన్ ఫేస్ లో నవ్వు లేకపోవడం ఫ్యాన్స్ గమనించారు. ఆయన చాలా ముభావంగా.. సాడ్ గా ఉన్నట్లు కనిపించారు. దీంతో భార్యతో విడాకుల తరువాత పవన్ చాలా బాధ పడుతున్నారని తెలుస్తోంది. ఒకవైపు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ట్రోల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ, వాటితో ఏమాత్రం సంబంధం లేనట్లుగా పవన్ కళ్యాణ్ తన ప్రభుత్వ బాధ్యతలను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుండటం విశేషం. గ్రామీణాభివృద్ధి, సాంకేతిక రంగాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న ప్రత్యేక దృష్టి పట్ల జనసేన కార్యకర్తలు, కూటమి నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ విడాకుల విషయమై ముందు ముందు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Updated Date - Nov 10 , 2026 | 03:08 PM